లండన్ వీధుల్లో సైకో.. కత్తితో 13 ఏళ్ల బాలుడిని నరికి చంపాడు

ఒక సైకో చేసిన కత్తి దాడిలో 13ఏళ్ళ బాలుడు మృతి చెందిన ఘటన లండన్ లో చోటు చేసుకుంది. ఈ దాడిలో మృతి చెందిన బాలుడితో సహా ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పోలీసులు కేసుల ఉండటం గమనార్హం. ట్యూబ్ స్టేషన్ వద్ద 36ఏళ్ళ సైకో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈస్ట్ లండన్లో జరిగిన ఈ ఘటనలో సైకోను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడి ఘటన ఈస్ట్ లండన్ వ్యాప్తంగా కలవరపాటుకు గురి చేసిందని పోలీసులు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఈస్ట్ లండన్ వాసులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ దాడిలో ఉగ్రవాదుల ప్రమేయం లేదని భావిస్తున్నామని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, అనుమానితుల కోసం వెతకట్లేదని అన్నారు పోలీసులు.