మన ఊరు మన బడి వర్క్స్ ​స్లో

  • మన ఊరు మన బడి వర్క్స్ ​స్లో
  • స్కూల్స్​రీ ఓపెనింగ్​ దగ్గరికొచ్చినా ఇంకా కంప్లీట్ కాలే
  • క్లాస్​రూమ్స్​పనుల అసంపూర్తితో ప్రాబ్లమ్స్​

 కామారెడ్డి, వెలుగు గవర్నమెంట్​స్కూల్స్​లో సౌలత్​లు కల్పించి స్టూడెంట్స్​కు మెరుగైన విద్యనందించేందుకు చేపట్టిన మన ఊరు మన బడి పనులు స్లో అవుతున్నాయి. సమ్మర్​ హాలిడేస్​తర్వాత మళ్లీ స్కూల్స్​రీ ఓపెన్​కు టైం దగ్గరికొచ్చినా, పనులు మాత్రం కంప్లీట్​కాలేదు.   కామారెడ్డి జిల్లాలో 1,017 గవర్నమెంట్​స్కూల్స్​ఉన్నాయి. మన ఊరు మన బడి ప్రోగ్రామ్​కింద 351 స్కూల్స్​సెలక్ట్​ చేశారు. 235 స్కూల్స్​లో ఒక్కో స్కూల్​కు రూ.30 లక్షల కంటే తక్కువ వ్యయం, 116 స్కూల్స్​లో రూ.30 లక్షల కంటే ఎక్కువ ఖర్చుతో పనులు నడుస్తున్నాయి. క్లాస్​రూమ్స్​ నిర్మాణం, శిథిలమైన బిల్డింగ్​లకు రిపేర్, టాయిలెట్స్, ​కిచెన్​రూమ్స్, కాంపౌండ్​వాల్స్​కు పెయింటింగ్, బోర్డులు, కూర్చోడానికి బెంచీలు, ఇతర ఫర్నిచర్​ సౌలత్​లు కల్పించాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభమై ఏడాది కావొస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఫండ్స్​కొరత పనులపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఫస్ట్​ మండలానికి 2 స్కూల్స్​చొప్పున పనులు కంప్లీట్​ చేయాలని కొద్ది నెలల కింద ఉన్నతాధికారులు జిల్లా ఆఫీసర్లకు ఆదేశించారు. జిల్లాలో 44 స్కూల్స్​లో మాత్రమే100 శాతం పనులు పూర్తయ్యాయి. 

క్లాస్​రూమ్స్​ నిర్మాణ పనుల్లో డిలే  

తక్కువ అంచనా వ్యయంతో రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల లోపు పనులు కంప్లీట్​చేయించారు. 351 స్కూల్స్​కు గాను 232లో వర్క్స్​కంప్లీట్​అయినట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. పనులు పూర్తయిన వాటిలో బిల్డింగ్స్​ రిపేర్లు , టాయిలెట్స్​ నిర్మాణం, పెయింటింగ్, గ్రీన్ బోర్డుల ఏర్పాటు వంటి పనులు మాత్రమే  పూర్తయ్యాయి. క్లాస్​రూమ్స్ నిర్మాణ పనులు మాత్రం డిలే అవుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల షూరు చేయకపోగా, మరి కొన్ని చోట్ల ఇటీవల ప్రారంభించారు. హాలిడెస్​ తర్వాత ఈనెల 12 నుంచి స్కూల్స్​ రీ ఓపెన్​ కానున్నాయి. హాలిడేస్​లో పనులు చేయించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది. కొద్ది రోజుల కింద కలెక్టర్ ​రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేసి, పనులు త్వరగా కంప్లీట్ ​చేయాలని ఆఫీసర్లను ఆదేశించినా ఇంకా చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు. కామారెడ్డి, రాజంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, పిట్లం, పెద్దకొడప్​గల్, జుక్కల్, మద్నూర్, ఎల్లారెడ్డి మండలాల్లో క్లాస్​రూమ్స్​ నిర్మాణ పనులు, టాయిలెట్స్, కిచెన్​రూమ్స్​ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. మన ఊరు మన బడి పనులు చేపట్టాల్సిన చోట బిల్డింగ్స్​శిథిలావస్థలో ఉన్నాయి. పనులు అసంపూర్తిగా ఉన్న దృష్ట్యా  క్లాసులు నిర్వహించడం కష్టం. వరండాలు, చెట్ల కింద స్టూడెంట్స్​ను కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 

పూర్తి చేయాలని చెప్పాం..

మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనులు త్వరగా కంప్లీట్​ చేయాలని చెప్పాం. ఇదే వరకే సంబంధిత ఆఫీసర్ల ఆఫీసర్లు, కాంట్రాక్టర్లకు సూచించాం. కొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయి. వీటిని త్వరగా కంప్లీట్​ చేయిస్తాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి