సర్వే సిబ్బందికి అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: సీపీఎస్ఈయూ

సర్వే సిబ్బందికి అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: సీపీఎస్ఈయూ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన సిబ్బందికి అటెండెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా1.17 కోట్ల కుటుంబాలను 85వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే చేశామని తెలిపారు. సర్వే పూర్తయి నెలరోజులు గడిచినా సిబ్బందికి అటెండ్ సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే ఇస్తామంటూ ఎంపీడీవోలు, మున్సిపల్ ఆఫీసర్లు చెప్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో టీచర్లకు ఐదు పరిహార సాధారణ సెలవులను పొందేందుకు అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. దీంతో పాటు ఎన్యుమరేట్లకు రెమ్యునరేషన్ కోసం నిధులు రిలీజ్ చేయాలని కోరారు.