
- అసంపూర్తిగా మనపూరు-మనబడి పనులు
- క్లాస్‌రూమ్స్ లేక అవస్థలు పడుతున్న స్టూడెంట్లు
- ఫండ్స్ రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
కామారెడ్డి, వెలుగు: గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు– మనబడి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చాలా స్కూళ్లలో అడిషనల్ క్లాస్ రూంల నిర్మాణం ప్రారంభించగా ఫండ్స్ కొరతవల్ల అసంపూర్తిగా మిగిలాయి. పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో సరిపడినన్ని క్లాస్రూమ్స్లేక అనేక చోట్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల శిథిలమైన బిల్డింగ్‌ల్లోనే చదువులు సాగుతున్నాయి. సమ్మర్ హాలిడేస్లోనైనా వర్క్స్ కంప్లీట్ చేస్తే వచ్చే ఏడాదైనా తరగతిగదుల కొరత తీరుతుందని స్టూడెంట్స్అంటున్నారు.
జిల్లాలో 1,013 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 352 స్కూళ్లను మన ఊరు- మన బడి కింద సెలక్ట్ చేశారు. శిథిలమైన చోట కొత్త బిల్డింగులు, అవసరమైన చోట అడిషనల్ క్లాస్ రూమ్స్, కిచెన్షెడ్లు, కంపౌండ్వాల్స్, టాయిలెట్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకుని.. రూ. 175 కోట్లతో పనులు ప్రారంభించారు. పనులు చేపట్టి 3 ఏండ్లయినా ఇంత వరకు కంప్లీట్ కాలేదు. మెత్తం 352 చోట్ల వర్క్స్మొదలు పెట్టగా 62 వర్క్స్ కంప్లీట్ కాగా, 183 వర్క్స్ మధ్యలో అగిపోయాయి. 42 చోట్ల పనులు ప్రారంభమే కాలేదు.
పనులు చేసిన వారికి కేవలం రూ. 27 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. పనులు మొదలు పెట్టి నెలలు గడిచినా బిల్లుల సరిగా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే అపేశారు. కామారెడ్డిటౌన్, కామారెడ్డి మండలంలోని పలు గ్రామాలు, నస్రుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్, దుర్కి, లింగంపల్లి తండా, బాన్సువాడ మండలం మొగిలానిపల్లి , సంగమేశ్వర్కాలనీ, బాన్స్వాడ టౌన్, పిట్లం మండలం అన్నారం, తాడ్వాయి, రాజంపేట, గాంధారి, భిక్కనూరు తదితర చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దళితవాడలోని హైస్కూల్లో క్లాస్ రూమ్ నిర్మాణానికి మూడేండ్ల కింద పనులు చేపట్టినా ఇప్పటికీ బేస్మెంట్ దశ దాటలేదు. పాత క్లాస్ రూమ్స్ సరిపోవటం లేదు. కొన్ని రూమ్స్శిథిలమయ్యాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గర్ల్స్ హైస్కూల్ బిల్డింగ్ శిథిలమైంది. మన ఊరు- మన బడి కింద ఇక్కడ క్లాస్ రూమ్స్ నిర్మాణం పనులు షూరు చేశారు. స్లాబ్‌ల వరకు పనులు కంప్లీట్ అయ్యాయి. ఫ్లోరింగ్తదితర పనులు జరగలేదు. బిల్స్ రాకపోవడంతో కాంట్రాక్టర్ వర్క్స్ అపేశారు. ప్రస్తుతం ఉన్న క్లాస్ రూమ్స్ పై కప్పులు పెచ్చులూడుతున్నాయి. క్లాస్ రూమ్స్ సరిపోక అసంపూర్తిగా అగిపోయిన బిల్డింగ్‌లోనే క్లాస్‌లు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.