
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్పద్ధతిలో కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి సింగరేణి యాజమాన్యం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇద్దరు చొప్పున అనస్తీషియా, ఈఎన్టీ సర్జన్, జనరల్ సర్జన్, ఫిజీషియన్, హెల్త్ఆఫీసర్లు, అప్తాల్మోలోజిస్టులు, ముగ్గురు చొప్పున రెడియోలాజిస్ట్, ఆర్థో సర్జన్డాక్టర్లు, ఒక చెస్ట్ ఫిజీషియన్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అర్హులైన డాక్టర్లు ఈనెల 12 నుంచి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు పంపించాలని, ఎంపికైన డాక్టర్లు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుందని యాజమాన్యం పేర్కొంది.