
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్), రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్లు, పీజీ అభ్యర్థులకు 29 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.rfcl.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.