
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 30 ఏండ్లు మించరాదు. జీతం రూ.15,600 నుంచి -39,100 వరకు చెల్లిస్తారు.
సెలెక్షన్: యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.nhai.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.