లారీ కింద చిక్కున్న యువతి.. జాకీలు పెట్టించి రక్షించిన మంత్రి బండి సంజయ్

లారీ కింద చిక్కున్న యువతి.. జాకీలు పెట్టించి రక్షించిన మంత్రి బండి సంజయ్

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. లారీ కింద పడిపోయిన ఆమె కేకేలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ఆపాడు. హుజూరాబాద్‌లోని సింగపూర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరుకు చెందిన దివ్యశ్రీ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కింద చిక్కుకుంది. ఆమె జుట్టు లారీ ముందు చక్రాల కింద పడి ట్రక్ కింద నుంచి బయటకు రాలేకపోయింది. 

అదే రోడ్డు మార్గంలో ములుగు వెళ్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ ఆపి.. సహాయక చర్యలు చేప్టట్టారు. జాకీలు, కట్టర్లు తెప్పించి వెంటనే ఆమెను ట్రక్ కింద నుంచి సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. లారీ కింద జాకీలు పెట్టి.. యువతి జుట్టు కత్తిరించి బయటకు తీశారు. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను రక్షించడంలో సహాయ పడ్డారు. స్వల్ప గాయాలతో బయట పడ్డ దివ్యశ్రీని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.