
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand), ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే(Manamey). టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆధిత్య(Sriram Adhitya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విధాలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా వచ్చిన మనమే ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
జూన్ 7న మనమే సినిమా విడుదలకానున్న నేపధ్యంలో జూన్ 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు. అయితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, ఈవెంట్ కు వచ్చే చీఫ్ గెస్ట్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే గా పోటీచేస్తుండటంతో పిఠాపురం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రేజ్ ను మనమే సినిమా కోసం వాడేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.
ఇక ఈ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారట. ఇండస్ట్రీలో రామ్ చరణ్, శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈ సినిమాను రామ్ చరణ్ ను తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడట శర్వా. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి పిఠాపురం క్రేజ్ మనమే సినిమాకి ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో చూడాలి.