
ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో తన ఫేవరేట్ మూవీ ‘మనమే’ అని చెప్పాడు శ్రీరామ్ ఆదిత్య. ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఉంటాయని అన్నాడు. శర్వానంద్, కృతి శెట్టి జంటగా తను రూపొందించిన ఈ చిత్రం జూన్ 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ‘-పేరెంటింగ్ ఎమోషన్ గురించి కొంచెం డిఫరెంట్‌గా చెప్పాలనే ఐడియా ఎప్పటినుంచో ఉంది. అది ఫన్‌గా ఫుల్ ఎనర్జీతో చెప్పాలనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలతో సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అందులో తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది.
ఆ ఇన్నోసెన్స్ టచ్ చేయాలని అనుకున్న కథ ఇది. శర్వానంద్ కూడా స్టోరీ వినగానే ఓకే చెప్పాడు. ఇందులో తనది చిల్ క్యారెక్టర్. చాలా లైవ్లీగా ఉంటుంది. శర్వాని చాలా కొత్తగా చూస్తారు. రన్ రాజా రన్ ఎనర్జీకి మించి ఉంటుంది. ఇక -కృతిశెట్టి నేను అనుకున్న క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఆమె చాలా బ్రిలియంట్‌గా యాక్ట్ చేసింది. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. అలాగే ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నుంచి మా అబ్బాయి విక్రమ్ ఆదిత్యనే అనుకున్నాం.
తను కెమెరాకి చాలా బావుంటాడనిపించింది. ఇందులో 16 పాటలు ఉన్నా.. ప్రతి సాంగ్ సినిమాని ఇంకా ఫాస్ట్‌గా తీసుకెళుతుంది. హేశమ్ అబ్దుల్ వహాబ్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎనభై శాతం షూటింగ్ లండన్‌లో చేశాం. అక్కడి వాతావరణం సరిగా అనుకూలించక, కొన్ని చాలెంజెస్ ఫేస్ చేశాం. అయినా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.