ఫోక్ సాంగ్‌‌కు సూపర్​ రెస్పాన్స్

ఫోక్ సాంగ్‌‌కు సూపర్​ రెస్పాన్స్

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ మానస్, విష్ణుప్రియ జంటగా ‘గంగులు’ అనే ఫోక్ సాంగ్‌‌ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో పాటను ట్యూన్ చేయగా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ  స్టెప్స్ కంపోజ్ చేసింది. తెలుగుతనం ఉట్టిపడేలా తరుణ్ సైదులు రాసిన లిరిక్స్‌‌ను  స్వరాజ్ కీర్తన్ బాగా పాడాడు. జ్యోతి కున్నూరు నిర్మించిన ఈ ఫోక్ సాంగ్‌‌ను నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా  విడుదల చేసారు.

 మానస్ మాట్లాడుతూ ‘ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. సాయి శ్రీరామ్ వండర్ ఫుల్  విజువల్స్ ఇచ్చారు.  స్వచ్ఛమైన తెలుగు పదాలతో  వచ్చిన ఈ ఫోక్ సాంగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది’ అన్నాడు. ‘మానస్‌‌తో కలిసి ఇంతకుముందు చేసిన ‘జరీ జరీ  పంచె కట్టు’ పాటకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ‘గంగులు’ పాట కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అంది విష్ణు ప్రియ.  భీమ్స్,  జానీ మాస్టర్,  జయతి, నివృతి వైబ్స్ మనోహర్,  పద్మిని నాగులపల్లి  పాల్గొన్నారు.