Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. 7 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. 7 వికెట్లతో చెలరేగిన మానవ్ సుతార్

దులీప్ ట్రోఫి 2024 ఈ సారి భారీ క్రేజ్ వచ్చింది. టీమిండియా స్టార్ క్రికెటర్లందరూ ఈ టోర్నీలో పాల్గొనడంతో ఇండియన్ క్రికెట్ లవర్స్ ఈ టోర్నీ చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అంచనాలు పెట్టుకున్న స్టార్ క్రికెటర్లు విఫలమవుతుంటే..యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. ముషీర్ ఖాన్ భారీ సెంచరీతో అదరగొడితే.. తాజాగా మానవ్‌ సుతార్‌ 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. దులీప్‌ ట్రోఫీలో ఇండియా-సి తరపున ఈ యువ స్పిన్నర్ తో తన స్పిన్‌ మ్యాజిక్‌తో చెలరేగిపోయాడు.

19.1 ఓవర్లు బౌలింగ్‌ చేసిన మానవ్‌.. 49 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అయిన మానవ్‌ సుతార్‌.. ఈ ఒక్క ప్రదర్శనతో టీమిండియా జట్టు రేస్ లోకి వచ్చాడు. అతను ఇదే ప్రదర్శన మిగిలిన మ్యాచ్ ల్లోనూ కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులో చూసిన ఆశ్చర్యం లేదు. శ్రేయస్‌ అయ్యర్‌, దేవదత్త్‌ పడిక్కల్‌, కేఎల్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌ లాంటి టీమిండియాకు ఆడిన ప్లేయర్లతో కూడిన టీమ్‌పై ఈ ప్రదర్శన చేయడం సామాన్యమైన విషయం కాదు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా–డి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైంది. అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (86) ఒంటరి పోరాటం చేసినా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 48.3 ఓవర్లలో 164 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ (3/19), అన్షుల్‌‌‌‌‌‌‌‌ కాంబోజ్‌‌‌‌‌‌‌‌ (2/47), హిమాన్షు చౌహాన్‌‌‌‌‌‌‌‌ (2/22) దెబ్బకు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. అంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా–సి 168 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. హర్షిత్ రానా 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా–డి 236 పరుగులకే ఆలౌటై ప్రత్యర్థి ముందు 233 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.