మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు వ్యతిరేకంగా సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో కొందరు యువకులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. గాంధీ పార్కు ఏరియాలో ‘నువ్వొద్దు.. నీ నోటొద్దు.. మంచిర్యాలకు మీరు వద్దు’, ‘దివాకర్‌రావు మరో పేరు పనికిరావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ మైక్‌తో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
ఎమ్మెల్యే, ఆయన కొడుకు విజిత్‌రావు అవినీతి పెరిగిపోయిందని, భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్క లైబ్రరీలోనే రూ.3కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దివాకర్‌రావును ఓడించాలని కోరారు. దివాకర్‌రావు ఇప్పటివరకు చేసిన అవినీతి చాలని, ఇక రెస్ట్‌తీసుకోవాలని విమర్శించారు. ప్రస్తుతం యువకుల ప్రచారం వీడియో సోషల్‌మీడియాలో వైరల్అవుతోంది.
సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన సురేశ్దుప్త అనే యువకుడు అవినీతి రహిత పాలన కావాలంటే నిజాయతీపరులను ఎన్నుకోవాలని కోరుతూ కొంతకాలంగా ఇలా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా సోమవారం మంచిర్యాలలో ప్రచారం చేశాడు.