గడ్డం వినోద్​కు పురాణం సతీశ్ ​క్షమాపణ చెప్పాలి : కుంబాల రాజేశ్

బెల్లంపల్లి: వెలుగు :  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తప్పుడు ఆరోపణలు చేశారని.. ఎమ్మెల్యేకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కుంబాల రాజేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానికంగా మాట్లాడారు. దళిత ఎమ్మెల్యే అయిన గడ్డం వినోద్​పై పురాణం సతీశ్ అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు.

క్షమాపణ చెప్పకుంటే సతీశ్​ను జిల్లాలో అడ్డుకుంటామని హెచ్చరించారు. మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి పైడిమల్ల చంద్రశేఖర్,  ట్టణ గౌరవ అధ్యక్షుడు నంది కొమురయ్య, కోశాధికారి పట్నం చక్రధర్, ఉపాధ్యక్షుడు భూపెల్లి శ్రీధర్, సీనియర్ లీడర్లు సుభాశ్​తదితరులు పాల్గొన్నారు.