
నస్పూర్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన యూనిఫామ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, విద్యాశాఖ సమన్వయకర్త చౌదరితో కలిసి ఎంఈవోలు, ఏపీఎంలు, జిల్లా సమాఖ్య, మెప్మా సభ్యులతో రివ్యూ నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోందన్నారు.
ప్రతి ప్రభుత్వ స్కూల్లో తాగునీరు, విద్యుత్, కిచెన్, భోజనశాల, ప్రహరీ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తోందని తెలిపారు. యూనిఫామ్ల తయారీ ప్రక్రియను స్పీడప్చేసి, మే నెల 20 లోగా సిద్ధం చేసేలా సమన్వయంతో పనిచేయాలన్నారు