
తాండూరు, వెలుగు: ఆదివాసీ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రధాన్యం ఇస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. హైదారాబాద్‌కు చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ స్లో మ్యాన్ సంస్థ సహకారంతో తాండూరు సర్కిల్మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్(బెజ్జాల)లో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారన్నారు.
వెనుకబడిన ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి వారికి విద్య, వైద్యం అందేలా చూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా త్రీ ఇంక్లైన్, ఫైవ్ ఇంక్లైన్, నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ ఆదివాపీ గూడాలకు చెందిన 365 కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పప్పును డీసీపీ భాస్కర్, ఏసీపీ ఎ.రవికుమార్అందచేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి ఆదివాసీలతో సహపంక్తి భోజనం చేశారు. తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం, కన్నెపల్లి, భీమిని ఎస్సైలు సౌజన్య, గంగారాం, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.