విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : డీఈఓ యాదయ్య

విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి :  డీఈఓ యాదయ్య
  • డీఈఓ యాదయ్య

దండేపల్లి, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య అన్నారు.  ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోగా శుక్రవారం  దండేపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని  పరిశీలించారు.   నాణ్యమైన కూరగాయలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వంట చేయాలని కిచెన్‌తో  పాటు వంటపాత్రలు శుభ్రపరచాలని సూచించారు.

చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున బాలికలకు సరిపడ దుప్పట్లు ఉన్నాయా? వేడి నీళ్లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు.  సీఆర్టీలు, సిబ్బంది బాధ్యత రాహిత్యంగా పనిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  ఆయన వెంట ఇన్‌ చార్జి స్పెషల్ ఆఫీసర్ భాగ్య ఉన్నారు.