చెన్నూరు: ‘జీవనాధారమైన భూములు పోతే మేమెట్ల బతకాలె ..మా భూములు బలవంతంగా గుంజుకోవద్దు సారూ’ అంటూ ఓ మహిళ రైతు ఎస్సై కాళ్లమీద పడి వేడుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భాగంగా పంప్ హౌస్ నిర్మాణానికి 54 ఎకరాల సేకరణకు అధికారులు సర్వే కోసం వచ్చారు.
పొక్కూరు, ముత్తరావుపల్లె రైతులు అధికారులు అడ్డుకుని జీవనాధారమైన తమ భూములను తీసుకోవద్దని వేడుకున్నారు.భూములు ఇవ్వబోమని ఆఫీసర్లకు ఎన్నిసార్లు తెలిపినా మళ్లీ మళ్లీ వచ్చి సర్వే చేస్తున్నారని రైతులు వాపోయారు.