మంచిర్యాల జిల్లాలో టీబీ పేషెంట్లకు ప్రత్యేక అబులెన్సుల్లో సేవలు

 మంచిర్యాల జిల్లాలో టీబీ పేషెంట్లకు ప్రత్యేక అబులెన్సుల్లో సేవలు

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ భవన కార్మికులకు హెచ్ఐవీ, టీబీ పేషెంట్లకు పది రోజుల పాటు ప్రత్యేక అంబులెన్సుల్లో సేవలందిస్తామని మంచిర్యాల డీఎంహెచ్​వో హరీశ్ రాజ్ తెలిపారు.  అంబులెన్సులను ప్రారంభించినట్లు చెప్పారు. హెచ్ఐవీ, టీబీ వ్యాధితో బాధపడుతున్న వారికి జిల్లాకు కేటాయించిన అంబులెన్స్​ల ద్వారా వారి ఇంటికి వెళ్లి పది రోజులపాటు సేవలందిస్తామన్నారు. 

జిల్లాలోని భీమారం, జైపూర్, హాజీపూర్, దండేపల్లి, జన్నారం, మందమర్రి, కాసిపేట, భీమిని, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల్ మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పీహెచ్ సీల పరిధిలోని పల్లె దావఖానల్లో టీబీ పేషెంట్లను గుర్తించి టీకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సుధాకర్ నాయక్, ప్రసాద్, ముస్తఫా, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.