మున్సిపల్ కమిషనర్ భార్య సూసైడ్

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి సూసైడ్ ​చేసుకున్నారు. స్థానిక ఆదిత్య ఎంక్లేవ్ లో వారు నివాసం ఉంటున్న అపార్ట్​మెంట్లోని ఓ గదిలో ఆమె చున్నీతో ఉరేసుకున్నారు.భర్త ఉదయం ఆఫీసుకు, ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెళ్లారు. బాలకృష్ణ మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి డోర్లు పెట్టి ఉండగా.. ఎంత పిలిచినా ఆమె పలకకపోవడంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే జ్యోతి బెడ్రూంలో ఉరికి వేలాడుతోంది. వెంటనే బాలకృష్ణ తన సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ , ఏసీపీలు విచారణ చేపట్టారు. జ్యోతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.