సీఎం, మంత్రుల ఫోటోలకు ఎమ్మెల్యే క్షీరాభిషేకం : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

సీఎం, మంత్రుల ఫోటోలకు ఎమ్మెల్యే క్షీరాభిషేకం : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఫోటోలకు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ రైతులకు, రైతు కూలీలకు, పేదలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్నారు. అనంతరం స్వీట్లు పంచి, పటాకులు  కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.