వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : ప్రేమ్ సాగర్ రావు

  • మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

లక్సెట్టిపేట, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన లక్సెట్టిపేట మండలంలోని ఎల్లారం, కొత్తూర్, వెంకట్రావుపేట, కొమ్ముగూడెం, దౌడపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు.

పార్లమెంట్ ఎన్నికల్లో వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని, ఉద్యోగ సమస్యను నివారించేందుకు కృషి చేస్తాడని అన్నారు. విద్యావంతుడైన వంశీ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి పథంలో నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు పింగళి రమేశ్, చింత అశోక్, చల్లా నాగభూషణం, ఎండీ ఆరిఫ్, కొత్త వెంకటేశ్వర్లు, నలిమెల రాజు తదితరులు పాల్గొన్నారు.