కాకా క్రికెట్ టోర్నీ: మంచిర్యాల రాయల్స్​ తొలి విక్టరీ

కాకా క్రికెట్ టోర్నీ: మంచిర్యాల రాయల్స్​ తొలి విక్టరీ
  • కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్​పోటీలు ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్​పోటీలు సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి టాస్​వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్దిసేపు క్రికెట్ఆడారు. ముందుగా కాకా వెంకటస్వామి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. 

అనంతరం మంచిర్యాల రాయల్స్, లక్సెట్టిపేట హీరోస్ టీమ్ ల మధ్య జరిగిన పోటీలో మంచిర్యాల రాయల్స్ విక్టరీ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్సెట్టిపేట హీరోస్ టీం 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 100 రన్స్​చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన మంచిర్యాల రాయల్స్​9.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 103 రన్స్​చేసి విజయం సాధించింది. ఎండి.సైఫ్​అలీ​ 31 బాల్స్​లో 62 రన్స్​తో నాటౌట్​గా నిలిచి ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​దక్కించుకున్నాడు. బౌలర్​అశ్వీక్​ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు. క్యాతనపల్లి మున్సిపల్​ చైర్ పర్సన్ జంగం కళ, వైస్​చైర్మన్​ సాగర్​రెడ్డి, నిర్వాహకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.