![ఈడీ విచారణలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పా](https://static.v6velugu.com/uploads/2022/09/Manchi-reddy-kishan-reddy-react-on-ed-enquiry_w5WryEl39J.jpg)
ఈడీ విచారణ పై ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పందించారు. గత ఎన్నికల్లో తన గెలుపును జీర్ణించుకోలేని ప్రత్యర్థులు పలుమార్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. అయితే ఆ కేసులు ఎటూ తెలకపోవడంతో తప్పుడు ఆరోపణలతో ఈడీకి కంప్లైంట్ చేశారని మంచిరెడ్డి ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన ఈడీ 2014 ఆగస్టులో తాను వీదేశీ టూర్ లో ఉండగా ఒకరి నుండి 6 వేల డాలర్లు, మరొకరి నుంచి 3వేల డాలర్లు తీసుకోవడంపై కేసు నమోదు చేసిందని అన్నారు.
నలుగురు మిత్రులతో కలిసి ఫారిన్ టూర్ కి వెళ్లినప్పుడు.. అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు పర్యటన కొనసాగడంతో వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ నుండి ఆ డబ్బు తీసుకున్నానని మంచిరెడ్డి చెప్పారు. అది ఫెమా పరిధిలోకి వస్తుందన్న అనుమానంతో అధికారులు విచారణ జరిపారని అన్నారు. ఈడీ విచారణలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పానన్న మంచిరెడ్డి.. గోల్డ్ మైన్స్ ఉన్నాయని, వాటిల్లో పెట్టుబడులు పెట్టానన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.