మంచిర్యాల జిల్లాలో కన్నేపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం(అక్టోబర్ 07) 10 మంది విద్యార్థులు అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. వారిని బెల్లంపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గత మూడు రోజులుగా విద్యార్థులకు జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నా హాస్టల్ లో అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల వారికి జ్వరాలు వచ్చాయని చెప్పారు.
అస్వస్థతకు గురైన వారిలో వైష్ణవి అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనతో పాఠశాలలో గందరగోళం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.