ఆవులు, గేదెలు ఇస్తామని రైతులను మోసం చేసిన నిందితుల అరెస్ట్ 

ఆవులు, గేదెలు ఇస్తామని రైతులను మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ.5 కోట్లతో బెల్లంపల్లిలో పెద్ద పాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ స్థానిక రైతులను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని చెప్పారు. ND సూర్య అనే మీడియా కార్డును చూపిస్తూ టోల్ గేట్ల వద్ద, ఇతర అధికారులను బెదిరించినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి పలు డాక్యుమెంట్స్, బ్యాంక్ పాస్ బుక్కులు, కంపెనీ లెటర్ ప్యాడ్స్,కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.