
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మోడల్స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను గురువారం మంచిర్యాల డీఈఓ యాదయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై స్కూల్ ప్రిన్సిపాల్జయకృష్ణరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మందమర్రి పట్టణం శ్రీపతినగర్లో వియోజన విద్య, కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
విద్యతోనే మహిళల వికాసం సాధ్యమన్నారు. కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్, డీఆర్ పీలు బండ శాంకరీ, అశోక్ రావు, శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక తదితరులు పాల్గొన్నారు.