
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. శుక్రవారం బెల్లంపల్లిలోని ఏఎంసీ–2 గ్రౌండ్లో బెల్లంపల్లి, -తాండూర్జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెల్లంపల్లి టీమ్119 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెల్లంపల్లి టీమ్20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 177 సాధించింది. చేజింగ్లో తాండూర్ ప్లేయర్లు 16 ఓవర్లలో కేవలం 58 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.
12 ఫోర్లు బాది 81 రన్స్ చేసిన బెల్లంపల్లి బ్యాటర్ఎల్.శివకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. అలాగే సాయిరాం 46, శరత్31 పరుగులు చేశారు. రెండో మ్యాచ్‌లో నెన్నెల, భీమిని టీమ్స్ తలపడగా, నెన్నెల టీమ్సునాయాసంగా నెగ్గింది. మొదట బ్యాటింగ్చేసిన భీమిని టీమ్ 8.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌట్ అయింది. నెన్నెల బౌలర్లు చందు, రాజేశ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్చేసిన నెన్నెల బ్యాటర్లు 4.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి టార్గెట్చేజ్చేశారు. నెన్నెల చెందిన సంతు ‘ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్’గా నిలిచాడు.
రామకృష్ణాపూర్లో..
రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో మందమర్రి టైగర్స్ టీమ్, -ఆర్కేపీ క్రికెట్ క్లబ్ టీమ్‌పై 41 పరుగులు తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్చేసిన మందమర్రి టైగర్స్టీమ్20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ కు దిగిన ఆర్కేపీ క్రికెట్ క్లబ్ ప్లేయర్లు137 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
12 ఫోర్లు బాది 57 రన్స్స్కోర్చేసిన మందమర్రి టైగర్స్ బ్యాటర్భార్గవ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో కోటపల్లి టైగర్స్టీమ్పై భీమారం టీమ్ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భీమారం టైగర్స్15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేయగా, చేజింగ్లో భీమారం జట్టు మూడు వికెట్లు కోల్పోయి 11.2 ఓవర్లలో 93 పరుగులు చేసి గెలిచింది.10 ఫోర్లతో 45 రన్స్ చేసిన రంజిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.