
బెల్లంపల్లి రూరల్, వెలుగు: కల్వర్టు కూలిపోయి రాకపోకలు బంద్కావడంతో నిండు గర్భిణి ఆస్పత్రికి వెళ్లేందుకు నరకయాతన అనుభవించింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన గర్భిణి దుర్గం లావణ్య ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పయనమయ్యారు. అయితే, మల్లంపేట అటవీమార్గంలో ఉన్న కల్వర్టు వర్షాల కారణంగా రెండ్రోజుల కింద కూలిపోవడంతో లావణ్యను ఈ కల్వర్టు దాటించలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక ఆమెను అటవీ మార్గం గుండా రెండు కిలోమీటర్లు నడిపించుకుంటూ రోడ్డు వైపు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....