- మంచిర్యాల జిల్లా రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటు
- ఆర్‌ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులపై పునరాలోచించాలని విన్నపం
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రెండు గ్రూప్‌లుగా చీలిపోయింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి రా రైస్ మిల్లర్స్ విడిపోయి ప్రత్యేక యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరిగిన సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంత నాగరాజు, జనరల్ సెక్రటరీగా బత్తుల శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్‌గా మావడి సంతోష్, ఉపాధ్యక్షుడిగా జాడి రమేశ్, జాయింట్ సెక్రటరీగా కాళేశ్వరం సాగర్, ఈసీ మెంబర్లుగా ఆకుల సాయి, దర్శనాల రమేశ్, స్టేట్ కమిటీ ఈసీ మెంబర్‌గా గుంత సందీప్‌ను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ... 2021-–22 యాసంగి సీజన్‌లో రా రైస్ మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం కేటాయించడం వల్ల వర్షాలకు తడిసి భారీ స్థాయిలో నష్టం జరిగిందన్నారు. సీఎంఆర్ బకాయిల పేరిట ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ డెలివరీకి మరికొంత సమయం ఇవ్వాలని, కేసుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.