ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 

కోల్ బెల్ట్, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల డీఆర్డీవో కిషన్ సూచించారు. శనివారం మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. పులిమడుగు గ్రామ పంచాయతీలో చేపడుతున్న నీటికుంట పనులను పరిశీలించి కూలీలకు  పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ఓటు హక్కు లేనివారు సంబంధిత బీఎల్​వోను సంప్రదించి ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయన వెంట మందమర్రి ఎంపీడీవో రాజేశ్వర్, నోడల్ అధికారి సదానందం, ఏపీవో ఎండీ రజియా, ఈసీ రఘు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.