
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు మంగళవారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి తన కారు రెంట్‌కు పెట్టారు. పెండింగ్ లో ఉన్న ఆరు నెలల బిల్లు రూ.లక్షా 97 వేలు చెల్లించడానికి డీఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ షఫియొద్దీన్ మార్చిలో రూ.10వేలు డిమాండ్ చేశారు.
ఇటీవలే ఆయన రామగుండం మెడికల్ కాలేజీకి సూపరింటెండెంట్‌గా ప్రమోషన్‌పై వెళ్లారు. ఎన్ హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) జిల్లా అకౌంట్ ఆఫీసర్ దీపిక ద్వారా లంచం ఇవ్వాలని వేధించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట టైపిస్ట్రాజనర్సుకు రూ.10 వేలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు కరీంనగర్ జోన్ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.