వివేక్ వెంకటస్వామి వ్యాపారం చేసి కష్టపడి డబ్బులు సంపాదించారని , బాల్క సుమన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడో చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం మంచిర్యాల జిల్లాను నిర్లక్ష్యం చేసిందని చెప్పిన రేవంత్.. వివేక్, వినోద్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక్కడి కార్యకర్తలకు కాకా కుటుంబం అండగా ఉంటుందని.. కాకా కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
ఢిల్లీలో సొంత ఇంటిని AICC ఆఫీసుకు ఇచ్చిన కుటుంబం కాకాది అని రేవంత్ రెడ్డి చెప్పారు. కాకా వెంకటస్వామి కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి అని.. నిరంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణకు కాకా కుటుంబం అలాంటిదే అని అభివర్ణించారు రేవంత్ రెడ్డి. బెల్లంపల్లి కాంగ్రెస్ సభలో.. చెన్నూరు నియోజకవర్గం అభ్యర్థి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నియోజకవర్గం అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు.