ఓటేసిన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 

ఓటేసిన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 

మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ 2024 ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఓటింగ్ ప్రారంభమైన గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మంచిర్యాల జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ బూత్ నెం.143లో ఆయన ఓటు వేశారు. ఆయన తల్లి గడ్డం సరోజతోపాటు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా మంచిర్యాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది.