మంచు ఫ్యామిలీ(Manchu Family) హీరోలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి అన్నదమ్ములు ఇద్దరు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మంచు విష్ణు(Manchu Vishnu) ప్రస్తుతం ఆయన ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీస్తున్న కన్నప్ప(Kannappa) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక మనోజ్(Manchu Manoj) వాట్ ది ఫిష్(What the fish) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అంతేకాదు.. తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మిరాయ్(Mirai) మూవీలో కూడా కీ రోల్ చేస్తున్నాడు మంచు మనోజ్.
ఇదిలా ఉంటె.. తాజాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది. మంచు మనోజ్ చాలారోజుల తరువాత సినిమా షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిన సందర్బంగా ఓ ఫోటోని షేర్ చేస్తూ.. చాల గ్యాప్ తరువాత సినిమా సెట్ లోకి రావడం చాలా హ్యాపీగా అంది. నాకు ఇష్టమైన ప్లేస్.. అంటూ పోస్ట్ చేసాడు. మరోపక్క మంచు విష్ణు తన ఫోటోని షేర్ చేస్తూ.. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి.. అంటూ రాసుకొచ్చాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి తమ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ALSO READ : వారం రోజులు పాటు గేమ్ ఛేంజర్ ఫుల్ బిజీ ఎక్కడో తెలుసా!