సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.. మంచు బ్రదర్స్ ట్వీట్ వార్

మంచు బ్రదర్స్ మరోసారి మీడియాకెక్కారు. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు తిట్టుకున్నారు. ముందుగా మంచు విష్ణు ఎక్స్(ట్విట్టర్)లో ఓ సినిమా డైలాగ్ ను ట్వీట్ చేశాడు. పరోక్షంగా తననే అన్నట్లు భావించిన మనోజ్.. వెంటనే ఎక్స్ లో మరో కౌంటర్ ట్వీట్ పడేశాడు. అసలు వీరిద్దరు ఎక్స్ వేదికగా ఏమని తిట్టుకున్నారో చూద్దాం..

ముందుగా ట్వీట్ వార్ ను మంచు విష్ణు స్టార్ట్ చేశాడు. ‘‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది.. కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావు’’ అని తన తండ్రి ‘రౌడీ’ సినిమాలోని డైలాగ్ ను ట్వీట్ చేశాడు. సోషల్ మీడియా లో ఈ ట్వీట్ మంచు మనోజ్ ను ఉద్దేశించే విష్ణు చేశాడని చర్చ జరుగుతోంది.

విష్ణు ట్వీట్ చేసిన కాసేపటికే మనోజ్ మరో ట్వీట్ చేయడం సోషల్ మీడయాలో హీట్ పెంచింది. ‘‘కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’’ అని మనోజ్ కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశాడు. 

Also Read : సైఫ్ అలీఖాన్‎పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్

అన్నదమ్ముల వరుస ట్వీట్లపై సోషల్ మీడియాలో భలే చర్చ నడించింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.. ఇంటిపై దాడికి దిగడం అన్నీ అయిపోయాయి. ఇక ట్విట్టర్ వార్ ఒక్కటే మిగిలి ఉందని అనుకుంటున్నారు ఫ్యాన్స్.