మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!

మంచు వారి కుటుంబంలో అసలేం జరుగుతుందనే ప్రశ్నలు? రోజురోజుకు కొత్తగానే పుట్టుకొస్తున్నాయి. ఆస్తుల గొడవలని ఒకరు.. ఆత్మగౌరవం కోసం అని మరొకరు.. ఇలా ప్రతిదీ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి.

మనోజ్, విష్ణు, మోహన్ బాబుల మధ్య నడుస్తున్న తాజా పరిణామాలు చూస్తుంటే నడిచేది పెద్ద యుద్ధమే అనేలా ఉంది. అయితే, ఇవాళ డిసెంబర్ 10న కుటుంబంలో ఇంత జరుగుతుంటే మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మీ ఎక్కడనే ప్రశ్నలు మొదలయ్యాయి. 

Also Read :- మంచు విష్ణు ఎంట్రీతో మారిపోయిన సీన్

సోమవారం Dec 9న జల్పల్లిలోని ఫాంహౌస్లో మోహన్ బాబు, మంచు మనోజ్తో లక్ష్మి చర్చలు జరిపింది. అనంతరం.. అక్కడ నుంచి కారులో వెళ్లిపోయింది. మరి ఇవాళ ఎక్కడుంది అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే, లేటెస్ట్ అప్డేట్ మేరకు.. మంచు లక్ష్మి హైదరాబాద్ లో లేనట్టు తెలుస్తోంది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన వీడియో బట్టి ఇక్కడ లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోలో తాను ఎక్కడికో బయలుదేరినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే.. మంచు లక్ష్మి ముంబైలో ఉంటున్నట్టు సమాచారం. ఆస్తిలో రావాల్సింది తీసుకొని తను ముంబైలో సెటిల్ అయ్యిపోయిందనే రూమర్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంటనేది అందరూ నోరువిప్పితేనే తెలిసేలా ఉంది. ఈ క్రమంలో మంచువారి గొడవలకి ఫుల్ స్టాప్ అనేది ఉందా లేదా అనేది సస్పెన్స్గా మారింది.