మంచు ఫ్యామిలీలో గొడవలపై కథనాలు టాలీవుడ్ సర్కిల్ వైరల్ గా మారాయి. ఆస్తుల విషయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం దాడి చేసుకున్నారని.. డిసెంబర్ 8న ఉదయం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు సోషల్ మీడియా, పలు టీవీ ఛానెళ్లలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏకంగా గాయాలతోనే పీఎస్కు వెళ్లి మనోజ్, మోహన్ బాబు పరస్పరం డయల్ 100 ద్వారా కంప్లైంట్లు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
అయితే మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని మోహన్ బాబు పీఆర్ టీం స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాకు సూచించింది.
మరో వైపు మోహన్ బాబు విద్యా సంస్థలో కీలక పదవిలో ఉన్న వినయ్ , అతడి అనుచరులు మనోజ్ పై దాడి చేశారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. మా నాన్న ప్రమేయంతోనే వినయ్ దాడి చేశాడని..దీనిపై కాసేపట్లో పహాడి షరీఫ్ పీఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
అయితే మంచు ఫ్యామిలీపై మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా.. అటు మోహన్ బాబు కానీ..మంచు మనోజ్ కానీ అధికారికంగా ఎవరూ ఎక్కడా స్పందించలేదు. కానీ జల్ పల్లిలో నివాసం ఉంటున్న హీరో మోహన్ బాబు ఇంట్లో నుంచే డయల్ 100 కు కంప్లైంట్ వచ్చిందని పహడీ షరీఫ్ పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారు.
ALSO READ | గొడవలపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. అవాస్తవాలు అంటూ మీడియాకి సమాచారం
అసలు మోహన్ బాబు, మంచు మనోజ్ గొడవపడ్డారా?.పీఎస్ లో పరస్పరం ఫిర్యాదులు ఎంత వరకు నిజం. .మోహన్ బాబు అనుచరుడు వినయ్.. మనోజ్ పై నిజంగానే దాడి చేశాడా? వినయ్ పై మనోజ్ ఫిర్యాదు చేయబోతున్నాడా..అసలేం జరుగుతోంది. పహాడీ షరీఫ్ పోలీసులు దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు. అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.