హైదరాబాద్: జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లకు, మరో వైపు విష్ణు బౌన్సర్లకు మధ్య గొడవ జరిగింది. మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తుండటంతో గొడవ జరిగింది. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. గొడవ జరుగుతుండటంతో గమనించిన మంచు విష్ణు బయటకి వచ్చి బౌన్సర్లును బయటకి తోసేశారు.
మనోజ్ను, మౌనికను మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్కు మనోజ్ దంపతులు వెళ్లబోతున్నట్లు తెలిసింది. విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చి జల్పల్లి ఫాంహౌస్కు వెళ్లిన గంటల వ్యవధిలోనే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) December 10, 2024
మోహన్ బాబు ఫాంహౌస్ నుంచి తన భార్య మౌనికతో సహా బయటికొచ్చిన మంచు మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయటం లేదని, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మనోజ్ మీడియా ఎదుట చెప్పాడు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నార మనోజ్ మండిపడ్డాడు. న్యాయం కోసం అందరిని కలుస్తానని, తన భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే ఈ పోరాటం అని మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read : రెండు భాగాలుగా చెక్కుతున్న జక్కన్న
మొత్తంగా ఈ ఎపిసోడ్ను గమనిస్తే.. మంచు విష్ణు ఈ ఫ్యామిలీ ఎపిసోడ్కు ఎంటర్ అయిన తర్వాత మోహన్ బాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జల్పల్లి ఫాంహౌస్ నుంచి మనోజ్ను, అతని భార్యను వెళ్లిపోవాలని మోహన్ బాబు ఆదేశించేంత వరకూ పరిస్థితి వచ్చింది. ఇదంతా మంచు విష్ణు ఈ గొడవలోకి ఎంటర్ అయ్యాకే జరగడం గమనార్హం.
మోహన్ బాబు, మనోజ్ మధ్య అసలు గొడవేంటంటే..
ఆస్తి తగాదాలు మోహన్ బాబు, మనోజ్ మధ్య చిచ్చు పెట్టాయి. సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయని తాజా పరిణామాలతో తేలిపోయింది. ఆదివారం ఉదయం 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడిచేశారని మంచు మనోజ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే తన చిన్నకొడుకు మనోజ్‌తో ప్రాణహాని ఉందని మోహన్‌బాబు పోలీసులను ఆశ్రయించారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మనోజ్ ఫిర్యాదుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనోజ్, మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మనోజ్ ఫిర్యాదుతో మోహన్‌బాబు అనుచరులపై కేసు నమోదు చేశారు. 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం.