Manchu Lakshmi: వాళ్లది దురుసు ప్రవర్తన.. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు.. మంచు లక్ష్మి ఆగ్రహం

Manchu Lakshmi: వాళ్లది దురుసు ప్రవర్తన.. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు.. మంచు లక్ష్మి ఆగ్రహం

ఇండిగో ఎయిర్ లైన్స్ తీరుపై నటి, నిర్మాత మంచు లక్ష్మి Xలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6E 585 విమాన సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తించారని వాపోయారు.

Also Read :- సాయిపల్లవి మాస్ ర్యాగింగ్.. వర్క్ చేయడం కష్టమంటూ వెళ్లిపోయిన డైరెక్టర్!

'నా లగేజ్ బ్యాగ్ను పక్కకు తోసేశారు. దాన్ని ఓపెన్ కూడా చేయనివ్వలేదు. వాళ్లు చెప్పినట్టు చేయకపోతే నా లగేజీ గోవాలోనే వదిలేస్తామని బెదిరించారు. ఇదొక రకమైన వేధింపు. బ్యాగ్కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్టలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు' అని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.

అంతేకాదు తన బ్యాగుకు కనీసం లాక్‌ వేయలేదు, ట్యాగ్‌ కూడా వేయలేదని వీడియోలు సైతం Xలో షేర్‌ చేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి వీటిపై ఇండిగో విమానయాన సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.