'మాఫియా' కథాంశంతో పూరి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బిజినెస్‌మెన్' మూవీ గుర్తుంది కదూ.. ఈ చిత్రంలో సూపర్ స్టార్‌ని ముంబైకి ఎందుకొచ్చావురా..! అని బ్రహ్మాజీ అడిగితే.. ఉ*చ్చ పోయించడానికని సమాధానమిస్తాడు. అచ్చం అదే రీతిలో బాలీవుడ్ సినీ పరిశమ్రను ఏళదామని తెలుగు సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి అనుకున్నారట. కానీ, ఆమెను అలా ఎదగనివ్వకుండా తండ్రి పడ్డారట.
తన నటనా వృత్తికి కుటుంబసభ్యులు మద్దతు ఇవ్వలేదని లక్ష్మి మంచు వెల్లడించింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలడానికి( నటన పరంగా, నిర్మాతగా) హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లేటప్పుడు తన నిర్ణయానికి తండ్రి అడ్డుపడ్డారని తెలిపింది. తోటి స్నేహితులు, మిత్రుడు దగ్గుబాటి రానా వంటి పలువురు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని సూచిస్తే.. తన తండ్రి మాత్రం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చేరకుండా నిరోధించేవారని తెలిపింది.
పితృస్వామ్య బాధితురాలిని..
మంచు లక్మి తనను తాను "పితృస్వామ్య బాధితురాలిగా" చెప్పుకుంది. దక్షిణాదిలోని పురుషుల ఆలోచనా విధానం గురించి మాట్లాడుతూ.. "సౌత్‌లో పురుష హీరోల సోదరీమణులు లేదా కుమార్తెలు నటీమణులు కావడం సరైంది కాదు. మాలాంటి వారిని కాస్టింగ్ చేయడానికి అనుమతించరు. ప్రకాష్ నన్ను సినిమాలకు పరిచయం చేశారు. కానీ మా నాన్న, అతని నాన్న ఈ ఆలోచనను మా తలల నుండి తొలగించడానికి ప్రయత్నించారు. నా సోదరులు సులభంగా ఫేమ్ పొందగలిగితే.. నేను దానికోసం పోరాడవలసి వచ్చింది. ఇది సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది.." అని మోహన్ బాబు కుమార్తె వ్యాఖ్యానించింది. ఫ్రీ ప్రెస్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఈ వ్యాఖ్యలు చేసింది.
లక్ష్మీ మంచు గతేడాది మోహన్‌లాల్ నటించిన 'మాన్‌స్టర్' చిత్రంతో మలయాళంలో రంగప్రవేశం చేసింది.