నా డబ్బు.. నా ఇష్టం.. నీకేంట్రా నొప్పి: మంచు లక్ష్మి

నా డబ్బు.. నా ఇష్టం.. నీకేంట్రా నొప్పి: మంచు లక్ష్మి

మంచు లక్ష్మి(Manchu laxmi) సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ విషయాలు, సినిమా విషయాలు, తన చుట్టూ ఉండే సమస్యలపైన సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవడమే కాదు నెటిజన్స్ తట్రోల్స్ కూడా చేస్తున్నారు. 

ఇటీవల మంచు లక్ష్మి.. ఎయిర్ ఇండియా సంస్థను ప్రశ్నిస్తూ ఓ పోస్ట్‌ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ చెక్ ఇన్ వద్ద రెడ్ కార్పెట్‌లు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని, ఇదేంటని అడిగితే సిబ్బంది నవ్వుతున్నారని.. పోస్ట్‌లో పేర్కొన్నారు మంచు లక్ష్మి. మంచు లక్ష్మి పోస్ట్‌కు స్పందించిన ఎయిర్ ఇండియా.. ఆ విషయంపై తమ ముంబై ఎయిర్‌పోర్ట్ టీమ్‌కి సూచనలు ఇస్తామని చెప్పుకొచ్చారు. 

Also Read :- విన్నాను..చూశాను..మౌనంగా భరించాను..ఇగ ఆగను.. మంచు మనోజ్ ఇంట్రస్టింగ్ వీడియో

అయితే.. మంచు లక్ష్మి చేసిన ఈ పోస్ట్‌‌కు నెటిజన్స్ నుండి నెటిగివ్ కామెంట్ల వచ్చాయి. కారణం ఆమె బిజినెస్ క్లాస్ అని చెప్పడం, తన ఐఫోన్ చెప్పడంతో కొందరు నెటిజనులు ట్రోలింగ్‌ చేశారు. ఇక తాజాగా ఈ ట్రోల్స్ పై ఘాటుగా స్పందించారు మంచు లక్ష్మి.. నేను బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తే మీకేంటి నొప్పి. ఐఫోన్‌ ఉంటే మీకొచ్చిన నష్టం ఏంటి. నువ్వేమైనా కొనిచ్చావా.. నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేంట్రా నొప్పి. నువ్వేదో నాకు డబ్బులిస్తున్నట్టు ఫోజ్‌ కొడుతున్నావు. నాకు సొంతంగా ప్రైవేట్ జెట్ కావాలి. ఏ నీకు వద్దా.. నువ్వు పెద్ద కోరికలు కోరుకోవా.. కలలు కనవా’’ అంటూ మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేసిన ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.