హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి(Yakshini).బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో విభిన్న శైలి ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సిరీస్ నుంచి మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మంచు లక్ష్మీ జ్వాలగా నటిస్తోంది. మిస్టీరియస్ జ్వాల అంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా మంచు లక్ష్మి క్యారెక్టర్‌ను పరిచయం చేశారు మేకర్స్.చీర కట్టుకుని మంచు లక్ష్మీ చాలా అందంగా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో వెలుగుతున్న బంగ్లా మిస్టీరియస్ గా ఉంది.ఏదేమైనా యక్షిణి వెబ్ సిరీస్ పోస్టర్స్ తోనే ఆడియన్స్ లో గుబులు రేపుతోంది.
ఈ సిరీస్ పై డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.."మగవారందరూ, జాగ్రత్త! మీ కోసం యక్షిణి వస్తోంది! ఆమె చివరి వేట త్వరలో ప్రారంభమవుతుంది!" అంటూ హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మంచు లక్ష్మీ సినిమాల విషయానికి వస్తే..
సిద్ధార్ద్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తొలిసారిగా తెలుగులో నటించింది. అందులో తన నటనతో అనేక ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, బుడుగు వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి మెప్పించింది. మధ్యలో చందమామ కథలు, పిట్ట కథలు వంటి ఓటీటీ సినిమాలతో పాటు మలయాళంలో కూడా నటించి మెప్పించింది. మరి ఈ సీరీస్ తో ఎలాంటి హిట్ అందుకోబుతుందో చూడాలి.
Meet Jwala, the mysterious one 😳#YakshiniVasthundi Coming Soon in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi, Bangla, Marathi only on #DisneyPlusHotstar@vedhika4u @ActorRahulVijay @LakshmiManchu @UrsAjayRavuri @arkamediaworks @Shobu_ @DirTejaMarni @sharma_sowmya18… pic.twitter.com/rxstcHzoJq
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 23, 2024