Manchu Family Issue : చిన్న చిన్న గొడవలంట.. పట్టించుకోవద్దు : మంచు లక్ష్మి

సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మంచు బ్రదర్స్ వివాదంపై మంచు లక్ష్మి స్పందించారు. మోహన్ బాబు అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని  మంచు లక్ష్మి హ్యాండిల్ చేస్తోంది. అయితే, ఇద్దరి మధ్య జరిగిన విషయం గురించి తనకింకా తెలియదని, పూర్తి వివరాల్ని తెలుసుకుని ఈ విషయం గురించి మాట్లాడతానని మంచు లక్ష్మి తెలిపారు. విషయం తెలియకుండా వార్తల్ని స్ప్రెడ్ చేయడం సరికాదన్నారు. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని తర్వాత మాట్లాడతానని వెల్లడించారు. 

ప్రస్తుతం బంధువులతో బిజీగా ఉన్నానని.. అన్నదమ్ముల మధ్య వివాదాన్ని పరిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారామె. అందరూ ఈ విషయాన్ని ఇంటి సభ్యులు, అన్నదమ్ముల మధ్య జరిగే గొడవగా పరిగణంలోకి తీసుకోవాలని మీడియాకు విన్నవించారు మంచు లక్ష్మి.

ఈ గొడవ గురించి మనోజ్ సన్నిహితులెవరూ మాట్లాడటానికి ముందుకు రావడంలేదు. లక్ష్మి కూడా మీడియాతో మాట్లాడి.. లీక్ అయిన వీడియోను డిలీట్ చేయించే ప్రయత్నాలు చేస్తోంది.

మీడియాతో మాట్లాడిన విష్ణు.. ఇద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు వస్తుంటాయని, ఇది చాలా చిన్న విషయమన్నారు. తనకు వీడియో పోస్ట్ చేసిన విషయం తెలియదని చెప్పుకొచ్చాడు.  మనోజ్ చాలా చిన్నవాడు. తెలిపి తెలియక ఏదో మాట్లాడుతుంటాడు. దీన్ని పెద్ద విషయంగా చేయాల్సిన అవసరం లేదంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.