ఎంబీయూ వివాదంపై స్పందించిన మంచు మనోజ్.. వారికి సపోర్ట్ చేస్తూ ట్వీట్..

తెలుగులో విభిన్న కథనాలు ఎంచుకుంటూ హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరో మంచు మనోజ్ గురించి తెలుగు ఆడియన్స్  కి తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే మంచు మనోజ్ గత 6 ఏళ్లుగా తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి అందుబాటులో ఉంటున్నాడు. కాగా తాజాగా మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ కి సంబంధించిన వివాదం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

ALSO READ | హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత

ఇందులో భాగంగా  విద్యానికేతన్ సంతల వద్ద జరుగుతున్న ఆందోళనల గురించి నేను తెలుసుకున్నానని దీంతో చాలా బాధ పడ్డానని అలాగే తల్లిదండ్రులకు, విద్యార్థులకు  మద్దతు అందించాలనుకుంటున్నానని తెలిపాడు. అంతేగాకుండా తన తండ్రి మోహన్ బాబు విద్యార్థులు మరియు రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తారని చెప్పుకొచ్చాడు. 

ఈ క్రమంలో ఈ ఆందోళనలకి సంబంధించిన పూర్తీ వివరాలకై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ వినయ్‌ని సంప్రదించానని తొందర్లోనే పూర్తీ వివరాలు తెలియజేస్తామని అలాగే విద్యానికేతన్ సంస్థలలో ఏవైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే mm.mbu0419@gmail.comకి ఇమెయిల్ చెయ్యాలని కోరాడు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గత కొద్ది రోజులుగా ఎంబీయూ లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మంచు మనోజ్ ఈ విధంగా ట్విట్టర్ ద్వారా స్పందించాడు.