న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదన్నారు మంచు మనోజ్. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకిచ్చినందుకే తన అన్నయ్య విష్ణు నాన్నను అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. తమకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవన్నారు. విద్యార్థులు, తన కుటుంబం, తన బంధువుల కోసమే పోరాటమని చెప్పారు.
Also Read : శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని
అంతకు ముందు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా జల్ పల్లిలో ఉన్న తన ఆస్థులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని .. తన నివాసంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేసి తనకు అప్పగించాలని కలెక్టర్ ను కోరారు .మోహన్ బాబు గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో ఉంటున్నారు. మనోజ్ జల్ పల్లిలోని ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు మోహన్ బాబు.
మోహన్ బాబు ఫిర్యాదు పై స్పందించిన జిల్లా కలెక్టర్.. పోలీస్ ల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు. అనంతరం జల్ పల్లి లోని ఫామ్ హౌస్ లో ఉంటున్న మంచు మనోజ్ కి నోటీసులిచ్చారు కలెక్టర్. ఈ క్రమంలోనే మనోజ్ తన లీగల్ టీంతో జిల్లా కలెక్టర్ ను కలిశారు