ప్రభాస్ అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం.. ‘ఆదిపురుష్’. భారీ అంచనాల నడుమ చిత్రం 2023 జూన్ 16న రిలీజ్ కానుంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్.. రాముడిగా, హీరోయిన్ కృతిసనన్.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, హనుమంతుడిగా సన్నీసింగ్ నటించారు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి
అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూపించడానికి తమకు తోచిన రేంజ్‌లో టిక్కెట్లను బుక్ చేస్తున్నారు కొందరు సెలెబ్రిటీస్. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10వేల టిక్కెట్లను బుక్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టిక్కెట్స్ కొంటున్నట్లుగా ప్రకటించారు.
తాజాగా ఈ లిస్టులోకి యంగ్ హీరో మంచు మనోజ్ కూడా చేరాడు. ఆదిపురుష్ 2500 టికెట్లను బుక్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనాథ పిల్లలకు చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంచు మనోజ్–మౌనిక దంపతుల నుంచి ప్రకటన వచ్చింది. మంచు మనోజ్ కు తోడు.. టాలీవుడ్ ఈవెంట్ మేనిజింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు . మరోవైపు ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్‌లో హనుమంతుడికోసం ఒక సీటు కేటాయిస్తున్నారు.. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటన చేసింది.