Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్

మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదలైంది. మంచు బ్రదర్స్ (మనోజ్, విష్ణు) ఈసారి సోషల్ మీడియా ట్వీట్లతో ఒకరికొకరు ఇచ్చిపడేసుకుంటున్నారు. ఎక్స్(ట్విట్టర్)లో తమ సినిమాల డైలాగ్స్తో పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిపుచ్చుకుంటు ఈ ఇద్దరూ మళ్లీ రోడ్డున పడ్డారు.

లేటెస్ట్గా జనవరి 18న మంచు మనోజ్ #VisMith అనే హ్యాష్‌ట్యాగ్ పోస్ట్ చేస్తూ.. "విస్మిత్ నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. ఇక మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఈ విషయాల నుండి స్త్రీలు, నాన్న, సిబ్బంది మరియు చక్కెరను దూరంగా ఉంచుదాము.. దీనికి ఏమంటారు విస్మిత్?!  నేను ఎక్కడికైనా ఒంటరిగా వస్తానని హామీ ఇస్తున్నాను, మీరు ఎవరినైనా తెచ్చుకోగలరు. మనం బహిరంగంగా ఒక ఆరోగ్యకరమైన చర్చను మొదలెడదామా" అంటూ మనోజ్ X లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్కు  ఫోటో పోస్ట్ చేస్తూ #కరెంట్ తీగ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరి ఈ ట్వీట్ కి మంచు విష్ణు ఎలాంటి పోస్ట్ తో వస్తాడో చూడాలి. 

ముందుగా ట్వీట్ వార్ ను మంచు విష్ణు స్టార్ట్ చేశాడు. విష్ణు ఎక్స్(ట్విట్టర్)లో ఓ సినిమా డైలాగ్ను ట్వీట్ చేశాడు. పరోక్షంగా తననే అన్నట్లు భావించిన మనోజ్.. వెంటనే ఎక్స్లో మరో కౌంటర్ ట్వీట్ పడేశాడు.

Also Read :- సికింద్రాబాద్లో రానా, సుమ ఒక గుడికి వెళ్లారు.. అప్పుడేం జరిగిందంటే..

విష్ణు ఎక్స్(ట్విట్టర్)లో.. ‘‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది.. కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావు’’ అని తన తండ్రి ‘రౌడీ’ సినిమాలోని డైలాగ్ ను ట్వీట్ చేశాడు. సోషల్ మీడియా లో ఈ ట్వీట్ మంచు మనోజ్ ను ఉద్దేశించే విష్ణు చేశాడని చర్చ జరుగుతోంది.

విష్ణు ట్వీట్ చేసిన కాసేపటికే మనోజ్ మరో ట్వీట్ చేయడం సోషల్ మీడయాలో హీట్ పెంచింది. ‘‘కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’’ అని మనోజ్ కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశాడు. దీంతో అన్నదమ్ముల కొట్లాట ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని మాట్లాడుకుంటున్నారు.