హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) తన నెక్స్ట్ సినిమాగా మిరాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలీష్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన వీడియోకి భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆయన పాత్ర గురించి ఆడియన్స్ లో ఆత్రుత నెలకొంది. తాజాగా మే 20 మంచు మనోజ్ పుట్టినరోజు సందర్బంగా మిరాయ్ నుండి ఆయన పాత్రను రివీల్ చేస్తూ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. బ్లాక్ స్వార్డ్ అనే ఓ కత్తి గురించి చెప్తూ అది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అని మనోజ్ పాత్రను పరిచయం చేశారు. ఇక వీడియోలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టేశాడు మంచు మనోజ్. ఇక లాస్ట్ లో రెడ్ కలర్ డ్రెస్ లో స్లో మోషన్ లో వచ్చే సీన్ అయితే హైలెట్ అనే చెప్పాలి. ఈ వీడియోతో మిరాయ్ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఇక ఈ మిరాయ్ సినిమా కథ విషయానికి వస్తే.. కళింగ యుద్ధం తరువాత అశోకుడు యోగిగా మారిన విషయం తెలిసిందే. ఆయన అలా మారడానికి కారణమైన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే మిరాయ్ మూవీ. ఆ ఆపార గ్రంధాన్ని కాపాడే తొమ్మిదిమంది యోధుల్లో తేజ సజ్జ ఒకడు. వారికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతినాయకుడి పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నాడు. 3Dలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.