రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..

టాలీవుడ్ సీనియర్ మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇన్నిరోజులు వ్యక్తిగత గొడవలతో పోలీస్  స్టేషన్స్ చుట్టూ తిరిగినవాళ్ళు ఇప్పుడు ఆస్థి గొడవలతో మీడియా ముందుకు వస్తున్నారు. అయితే మంచు మనోజ్ ఉంటున్న ఫార్మ్ హోస్ ని ఖాళీ చేయించాలంటూ మంచు మోహన్ బాబు కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఇందులోభాగంగా ఆస్తులు విషయంలో కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపాడు. అలాగే విద్యానికేతన్ కూల్స్ విషయంలో కూడా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్కూల్స్, కాలజీల పేరుమీద లోన్ తీసుకుంటున్నారని దీంతో ఈ లోన్లు కట్టడానికి ఫీజులు పెంచుతున్నారని సంచలనం వ్యాఖ్యలు చేశాడు. 

అలాగే రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా తీస్తున్నారని ఈ సినిమా బడ్జెట్ ఎక్కడినుంచి తెస్తున్నారో చెప్పాలని మంచు ఫ్యామిలీ ని ప్రశ్నించాడు. ఇక తాను తన కుటుంబ సభ్యులని ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు కూడా చెప్పానని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచి మనోజ్ భైరవ,అహం బ్రహ్మాస్మి, మిరాయ్ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.